భువనేశ్వర్: జ్వరంతో గుక్క పెట్టి ఏడుస్తున్న నెల రోజుల పసి కందు పట్ల అతడి కుటుంబం మూఢ నమ్మంతో అమానుషంగా ప్రవర్తించింది. ఇనుప కడ్డీతో శిశువుకు 40 వాతలు పెట్టింది. ఈ ఘటన ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో జరిగిందని అధికారులు సోమవారం తెలిపారు.
ఫుండెల్పదా గ్రామానికి చెందిన బాధిత శిశువు ప్రస్తుతం ఉమెర్కోట్ సబ్ డివిజనల్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని సీడీఎంవో డాక్టర్ సంతోష్ కుమార్ పాండా తెలిపారు. ‘పసివాడి పొట్ట, తలపై 30-40 వాతలు కనిపించాయి. వేడి లోహంతో గుర్తులు వేస్తే రోగాలు నయమవుతాయనే మూఢ నమ్మకం వల్లే వాళ్లు ఇలా చేశారు’ అని ఆయన తెలిపారు.