ముంబై: ఇండస్ఇంద్ బ్యాంకు(IndusInd bank) ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాంకు డిపాజిటర్లు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండస్ఇంద్ బ్యాంకు వద్ద మూలధనం సమృద్ధిగా ఉందని, ఆర్థికంగా ఆ బ్యాంకు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నది. బ్యాంకుకు చెందిన క్యాపిటల్ అడిక్వసీ రేషియో 16.46 వద్ద, లిక్విడిటీ కవరేజ్ రేషియో 113 శాతం వద్ద ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇటీవల ఆ బ్యాంకులో జరిగిన అకౌంటింగ్ అవకతవకలను పరిశీలించినట్లు ఆర్బీఐ పేర్కొన్నది. ఎక్స్టర్నల్ ఆడి్ట్స్ నిర్వహించినట్లు చెప్పింది.
Statement on IndusInd Bank Limitedhttps://t.co/sCJmLCnzh8
— ReserveBankOfIndia (@RBI) March 15, 2025