హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం ఆగర్తలాలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్.. నల్లు ఇంద్రసేనారెడ్డిచేత ప్రమాణంచేయించారు.
ముందుగా, నల్లు ఇంద్రసేనారెడ్డి దంపతులు అగర్తలా విమానశ్రయంలో దిగగానే, త్రిపుర సీఎం డాక్టర్ మాణిక్ సాహ, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఘన స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్భవన్లో సీఎం మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో నల్లు ఇంద్రసేనారెడ్డి భేటీ అయ్యారు.