భోపాల్: కవల పిల్లలు, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించటం అరుదుగా సంభవిస్తుంటుంది. కానీ నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనివ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇండోర్‌కు చెందిన 29 ఏండ్ల మహిళ బుధవారం ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది.
ఇలాంటి కాన్పు తమ దవాఖానలో ఇదే మొదటిసారి అని ఇండోర్ క్లాత్ మార్కెట్ దవాఖాన వైద్య అధికారి డాక్టర్ ఆదిత్య సోమానీ తెలిపారు. గర్భిణి, పుట్టబోయే పిల్లల ప్రాణాలు రిస్క్‌లో పడకూడదన్న ఆలోచనతో సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించామని, ప్రసవం అనంతరం వారంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. పుట్టిన పిల్లల్లో ఒక్కొక్కరి బరువు 800 నుంచి 1500 గ్రాముల వరకు ఉందన్నారు.