ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఒకే రోజు అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి గిన్నిస్ రికార్డును సాధించింది. ఆదివారం 24 గంటల్లో 11 లక్షల మొక్కలను నాటి కొత్త రికార్డును నెలకొల్పింది. మొక్కలు నాటే కార్యక్రమంలో 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు, వంద మందికి పైగా ఎన్ఆర్ఐలు, ఎన్సీసీ కేడెట్లు, 50 స్కూళ్లకు చెందిన విద్యార్థులు, పౌరులు, వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు భాగస్వాములయ్యారు.
కాగా, అంతకుముందు ఈ గిన్నిస్ రికార్డు అస్సాం రాష్ట్రం పేరుపై ఉంది. 2023 సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9,21,730 మొక్కలను నాటారు. ఇప్పుడు ఇండోర్ ఆ రికార్డును అధిగమించింది. గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.