న్యూఢిల్లీ: భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సుబియాంతో జనవరి 25 నుంచి 26 వరకు భారత్లో పర్యటిస్తారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్కు వస్తున్నారని, అలాగే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది.