హైదరాబాద్: పాకిస్థాన్‌లోని షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight)పెను ప్రమాదం తప్పింది. విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇండిగో విమానం ఆదివారం ఉదయం షార్జా నుంచి హైదరాబాద్ బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గుర్తించిన పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించాలని సంబంధిత అధికారులను కోరారు. దీంతో విమానాన్ని కరాచీకి మల్లించారు.
అయితే విమానానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల కోసం కరాచీకి మరో విమానాన్ని పంపించనుంది. కాగా, భారత్‌కు చెందిన విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండవడం గత రెండువారల్లో ఇది రెండోసారి.