ముంబై, జూన్ 1: ఇండిగో ఫ్లైట్కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై బయల్దేరిన ఇండిగో ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిచ్చెనల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చినట్టు తెలిసింది. విమానానికి బాంబు బెదిరింపులు రావటం.. అత్యవసర ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టడం.. వారం రోజుల్లో ఇది రెండోసారి. మే 28న ఇండిగో వారణాసి ఫ్లైట్కు బాంబు బెదిరింపులు వచ్చాయి.