IndiGo Plane Hits Pole | ఎయిర్పోర్ట్లో పార్కింగ్ సమయంలో.. స్తంభాన్ని ఢీకొట్టిన ఇండిగో విమానం
IndiGo Plane Hits Pole | ఎయిర్పోర్ట్లో పార్కింగ్ సమయంలో ఇండిగో విమానం ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ పోల్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
శ్రీనగర్: ఎయిర్పోర్ట్లో పార్కింగ్ సమయంలో ఇండిగో విమానం ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ పోల్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. (IndiGo Plane Hits Pole) శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ 225 ఫ్లైట్ నవీ ముంబై నుంచి శ్రీనగర్ చేరుకున్నది. ఉదయం 9 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో అది ల్యాండ్ అయ్యింది. అయితే ఎయిర్పోర్ట్లోని 6వ నంబర్ బే వద్ద పార్కింగ్ సమయంలో ఆ విమానం ప్రమాదానికి గురైంది. అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ పోల్ ఒక పక్కకు ఒంగిపోయింది. ఈ సంఘటనలో ఇండిగో ఫ్లైట్ ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది.
కాగా, ఈ ప్రమాదాన్ని ఇండిగో సంస్థ ధృవీకరించింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. విమానంలోని మాన్యువల్ మెట్ల ద్వారా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించినట్లు వివరించింది.
మరోవైపు నిర్దేశిత నిబంధనల ప్రకారం ఈ సంఘటన గురించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. ఆ అధికారులతో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ‘అవసరమైన నిర్వహణ పనుల కోసం ఆ విమానాన్ని నిలిపివేశాం. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాం. వినియోగదారులు, సిబ్బంది భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత’ అని వెల్లడించింది.
అయితే ఈ సంఘటన తర్వాత శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. విమానాల రాకపోకలు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

