IndiGo | ముంబయి నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం మలేషియాలోని పెనాంగ్‌కు మళ్లించారు. ఫుకెట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబయి నుంచి ఫుకెట్‌కి బయలుదేరిన 6ఈ 1701 విమానాన్ని పెనాంగ్‌కు మళ్లించినట్లు తెలిపింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లేందుకు అవసరమైన అనుమతి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం మళ్లింపుపై ప్రయాణికులకు సమాచారాన్ని అందించామని తెలిపింది. ప్రయాణికులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అయితే, విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు.