న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన ప్రయాణికులు శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ కాలేదు. టిక్కెట్లు తీసుకున్న వారు గంటల కొద్దీ చెక్ఇన్ల కోసం వేచి చూడాల్సి వచ్చింది. వ్యవస్థల్లో ఏర్పడిన భారీ సాంకేతిక లోపం కారణంగా దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు అటంకం కలిగింది. దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ తాత్కాలికంగా నిలిచిపోవడంతో తమ వెబ్సైట్, బుకింగ్ వ్యవస్థలపై ప్రభావం చూపిందని, దీని కారణంగా తమ ప్రయాణికులు ఎక్కువసేపు వేచి చూడాల్సి వచ్చిందని ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు సమస్య ఏర్పడగా, ఒంటి గంటకు దానిని పునరుద్ధరించామని. అయినప్పటికీ పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్పారు. అయితే ఈ సమస్య ఎప్పటికి సరిచేస్తారన్న విషయాన్ని వారు తెలియజేయలేదు.