న్యూఢిల్లీ: శుక్రవారం భారత్‌లో మూడు విమానాలు వివిధ కారణాలతో ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించాయి. రాంచీ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్ అవుతుందనగా..ఆ విమానం ముందు టైర్ పంక్చర్ అయ్యిందన్న సంగతి తనిఖీల్లో బయటపడింది. మరో ఘటనలో అద్దీస్ అబాబా నుంచి ముంబైకి బయల్దేరిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మార్గమధ్యంలో ఉండగా..వాయు పీడనం సరిగాలేక ఏడుగురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ముంబైలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ జరిపారు. కాగా, క్యాబిన్లో ఏదో కాలుతున్న వాసన రావడంతో శుక్రవారం ఉద యం ముంబై నుంచి చెన్నైకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ముంబైకి తిరిగి వచ్చేసింది.