ఇంజిన్ వైఫల్యమే కారణం?
న్యూఢిల్లీ: విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానం(6ఈ579) ఇంజన్ విఫలమైనట్లు అనుమానం రావడంతో ఢిల్లీ విమానాశ్రయ రన్‌వేపై పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యవసర ప్రొటోకాల్స్ని విమానాశ్రయ అధికారులు వెంటనే అమలు చేయడంతో రన్‌వే 28ని హై అలర్ట్‌లో ఉంచారు.
కాగా, 161 మంది ప్రయాణికులతో వస్తున్న బోయింగ్ విమానం ఉదయం 11 గంటల సమయంలో రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ల్యాండింగ్ కావడానికి కొన్ని క్షణాల ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది.