World’s Top 100 Cities | న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన వంద నగరాల జాబితా-2024లో భారత్ నుంచి ఒకే ఒక్క నగరానికి చోటు దక్కింది. ఇక ఎప్పటిలానే వరుసగా నాలుగో ఏడాది కూడా ఫ్యాషన్ రాజధాని పారిస్ 17 మిలియన్లకుపైగా ఇన్బౌండ్ అరైవల్స్తో టాప్ ప్లేస్లో నిలిచింది. డాటా అనలిటిక్స్ కంపెనీ యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన తాజా జాబితాలో మాడ్రిడ్, టోక్యో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఢిల్లీ 74వ స్థానంలో నిలిచింది.