ఆదివారం 17 జనవరి 2021
National - Nov 27, 2020 , 16:27:11

ఇండియాతో డీల్‌.. బంగ్లాదేశ్‌కు 3 కోట్ల వ్యాక్సిన్ డోసులు

ఇండియాతో డీల్‌.. బంగ్లాదేశ్‌కు 3 కోట్ల వ్యాక్సిన్ డోసులు

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం ఇండియాతో డీల్ కుదుర్చుకుంది బంగ్లాదేశ్‌. ఇందులో భాగంగా 3 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను బంగ్లాదేశ్‌కు పంపించ‌నుంది. ఇండియా, బంగ్లాదేశ్‌తోపాటు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెక్సింకో ఫార్మాసూటికల్స్ కూడా ఈ డీల్‌లో ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన‌ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను బంగ్లాదేశ్‌కు స‌ర‌ఫ‌రా చేయ‌నుంది సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ తాజా డీల్ ద్వారా బంగ్లాదేశ్‌తో భార‌త్ సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని బంగ్లాదేశ్‌లో ఇండియా హై క‌మిష‌న‌ర్ విక్ర‌మ్ దొరైస్వామి ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌, సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ మ‌ధ్య కుదిరిన డీల్‌లో భాగంగా వ్యాక్సిన్ ఎప్పుడు సిద్ధ‌మైతే అప్పుడు 3 కోట్ల డోసులు అందించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌కు చెందిన బెక్సింకో ఫార్మాసూటిక‌ల్స్ రోజుకు 50 ల‌క్ష‌ల చొప్పిన డోసుల‌ను సీర‌మ్ నుంచి కొనుగోలు చేయ‌నుంది.