ఉదయం 11.30కి భారత తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్
భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోనున్నది.
- నేడే నింగిలోకి విక్రమ్-ఎస్
- సమాచార అధ్యయనమే లక్ష్యం
- ప్రారంభమైన కౌంట్‌డౌన్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోనున్నది. టెలిమెట్రీ, ట్రాకింగ్, ఇన్ ఏరియల్ మెజర్మెంట్, జీపీఎస్, ఆన్ బోర్డ్ కెమెరా, డాటా అక్విజిషన్ అండ్ పవర్ సిస్టం వంటి అంశాలను ఈ రాకెట్ అధ్యయనం చేయనున్నది.
ప్రైవేట్ తొలి అడుగు..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఈ రాకెట్‌ను రూపొందించింది. ఇస్రో, ఇన్‌స్పేస్ సహకారంతో రెండేండ్లలోపే దీన్ని సిద్ధం చేసింది. ప్రారంభ్ పేరుతో విక్రమ్-ఎస్ రాకెట్లను వరుసగా పంపేందుకు స్కైరూట్ ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నది. తొలి రాకెట్ ద్వారా స్పేస్ కిడ్స్ ఇండియా (తమిళనాడు), బజూమ్‌క్యూ (ఆర్మేనియా), ఎన్-స్పేస్ టెక్ ఇండియా(ఆంధ్రప్రదేశ్)కు చెందిన మూడు పేలోడ్స్‌ను నింగిలోకి పంపిస్తున్నారు.
విక్రమ్-ఎస్ విశేషాలు
ద్రవ్యరాశి – 545 కిలోలు
పొడవు – 6 మీటర్లు
పేలోడ్ సామర్థ్యం – 83 కిలోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

