పోఖ్రాన్, మార్చి 12: రాజస్థాన్లోని పోఖ్రాన్లో త్రివిధ దళాలు ‘భారత్ శక్తి’ పేరిట విన్యాసాలు నిర్వహించాయి. దేశీయ ఆయుధ సామర్థ్యాన్ని చాటిచెప్పాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ఎల్హెచ్ ఎంకే-IV యుద్ధ ట్యాంక్, కే-9 వజ్ర, ధనుష్, శరంగ్ యుద్ధ తుపాకుల వ్యవస్థ ఫైరింగ్ రేంజ్ సామర్థ్యాన్ని క్షేత్ర స్థాయిలో ప్రదర్శించారు. విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రధాని మోదీ, మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు.