Leopards | దేశంలో చిరుతల సంఖ్య(అంచనా) పెరిగింది. 2018లో దేశ వ్యాప్తంగా 12,852 చిరుతలుండగా 2022 నాటి ఆ సంఖ్య 13,874కు చేరుకున్నది. అయితే శివాంక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గింది. కేంద్ర పర్యావరణ శాఖ గురువారం విడుదల చేసిన ‘భారత్లో చిరుతల స్థితి’ నివేదికలో ఈ విషయాలను వెల్లడించారు.