శ్రీనగర్ : శెర్-ఇ-కశ్మీర్ వ్యవసాయ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఎస్కేయూఏఎస్టీ) పరిశోధకులు భారతదేశపు మొదటి జన్యు మార్పిడి గొర్రెను అభివృద్ధి(ఉత్పత్తి) చేశారు. పశు జీవ సాంకేతిక శాస్త్రంలో దీన్ని ఒక శాస్త్రీయ విజయంగా ఆ యూనివర్సిటీ అభివర్ణించింది. సీఆర్ఐఎస్పీఆర్-కాస్9 సాంకేతికతను ఉపయోగించి, అంతర్జాతీయ జీవ భద్రత ప్రొటోకాల్స్‌ను అనుసరించి ఈ గొర్రెను అభివృద్ధి చేశారు. ఈ గొర్రెలో విదేశీ జాతుల డీఎన్ఎ లేదని పరిశోధకులు తెలిపారు.
పశువైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నేతృత్వంలోని బృందం ‘మ్యోస్టేటిన్’ అనే కండరాలను నియంత్రించే జన్యువును పరివర్తన చేయడం ద్వారా ఈ జన్యు మార్పిడి గొర్రెను ఉత్పత్తి చేసింది.