ఆదివారం 29 మార్చి 2020
National - Mar 06, 2020 , 02:24:14

పారాసెటమాల్‌ చాలు!

పారాసెటమాల్‌ చాలు!
  • కరోనాపై ఆందోళన వద్దన్న ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కంగ్‌

న్యూఢిల్లీ, మార్చి 5: కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరంలేదని ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కంగ్‌ తెలిపారు. కరోనా సోకినట్టు నిర్ధారితమైన ప్రతి ఐదు కేసుల్లో నలుగురు తమకు తాముగా కోలుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. దగ్గు, జ్వరం తగ్గడానికి పారాసెటమాల్‌ వంటి మందుల్ని వాళ్లు తీసుకుంటే సరిపోతుందన్నారు. మిగిలిన ఒక్కరు మాత్రమే డాక్టర్‌ని సంప్రదించాలన్నారు. ‘కరోనా గురించి ప్రతి ఒక్కరూ అంతగా భయపడాల్సిన అవసరంలేదు. రోజూ మనం ఎన్నో వైరస్‌లకు ప్రభావితం అవుతుంటాం. అయితే వాటి నుంచి కాపాడుకోవడానికి చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవడం, క్రిముల్ని చంపే ద్రవాలతో ఇంట్లో నేలను శుభ్రంగా తుడుచుకోవడం, ముఖాన్ని తరుచూ చేతులతో తడుముకోకుండా ఉంటే సరిపోతుంది’ అని గగన్‌దీప్‌ తెలిపారు. ‘ఫ్లూ’తో పోలిస్తే కరోనా కొంత తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ, ‘సార్స్‌' అంతటి ప్రమాదకరమైనది కాదన్నారు. పెద్ద వయస్కులు, గుండెజబ్బులతో బాధపడేవారు, బీపీ, డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉందన్న గగన్‌దీప్‌.. శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వీలైనంత తొందరగా వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.


logo