Heavy Rains | నాగర్కర్నూల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభి నది
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Heavy Rains | నాగర్కర్నూల్ : మొంథా తుపాను ప్రభావంతో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చారకొండ మండల పరిధిలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎర్రవల్లి – గోకారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బైరాపూర్ వద్ద రోడ్డుపై నుంచి వాగు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కల్వకుర్తి – నాగర్కర్నూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.
ఇక నాగర్కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అమ్రాబాద్లో 19.7, ఐనవోలులో 17.8, అచ్చంపేటలో 15.8, చారకొండలో 13.3, ఊర్కొండలో 12.4, తెల్కపల్లిలో 12.1, బల్మూరులో 12, వెల్దండలో 10.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

