Mass Jathara | మాస్ మహారాజ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా మాస్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ ఈ నెల అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందు మూవీ ప్రమోషన్స్‌కి ఊపునిస్తూ, మంగళవారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈవెంట్లో రవితేజ, శ్రీలీల కలిసి సినిమాలోని ‘తుమేరా లవర్’ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్‌లో ఎనర్జీ నింపారు. మాస్ మహారాజ డ్యాన్స్ చూసి అభిమానులు ఉత్సాహంగా ఈలలు, కేకలతో ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు. రవితేజ ఎనర్జీ చూసి “హిట్ కమ్ బ్యాక్ పక్కా” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
జబర్దస్త్ అవినాష్ స్టేజ్‌పై పోర్టర్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీతో అదరగొట్టాడు. డ్యాన్స్ వేసి కిందకు దిగిన రవితేజను చూసి, “అలసిపోయినట్లున్నారు సార్… సమోసా తినండి” అని సరదాగా అన్నాడు. దానికి రవితేజ చమత్కారంగా “నేను అలసిపోను, ఆ సమోసా నువ్వే తిను” అని రిప్లై ఇవ్వడంతో అందరు నవ్వుకున్నారు. ఇక యాంకర్ సుమ, సూర్యను “రవితేజ మూవీస్‌లో మీకు నచ్చినవి ఏవి?” అని అడగగా, ఆయన “అన్నీ సినిమాలూ నాకు ఇష్టమే. ముఖ్యంగా ఇడియట్, విక్రమార్కుడు, కిక్ మూవీస్ అంటే ఎంతో ఇష్టం” అని చెప్పారు. తర్వాత ఈవెంట్లో రవితేజ పవర్ఫుల్ డైలాగ్ “రైల్వేలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్స్ ఉంటాయి… నేను వచ్చాక ఒకటే వార్ జోన్!” మళ్లీ రీ క్రియేట్ చేయడంతో వేదిక దద్దరిల్లింది
‘మాస్ జాతర’ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, ఇది ఆయన తొలి చిత్రం. రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించగా, నవీన్ చంద్ర విలన్‌గా కనిపించనున్నారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, వీటీవీ గణేష్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవితేజ RPF ఆఫీసర్‌గా, శ్రీలీల టీచర్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పించింది. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్తో నిండిన ఈ మూవీ దసరా తర్వాత బాక్సాఫీస్‌కి భారీ జాతరగా మారబోతోందని అభిమానులు అంటున్నారు.
Ravi Teja and Sreeleela dance to “Tu Mera Lover” song from #MassJathara pic.twitter.com/tEOAppyaYL
— idlebrain jeevi (@idlebrainjeevi) October 28, 2025