Boycott Turkey | న్యూఢిల్లీ, మే 16: భారత్‌తో సైనిక ఘర్షణల సందర్భంగా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచి డ్రోన్లతోపాటు సైనిక సిబ్బందిని కూడా అందచేసిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై భారత్‌లో బహిష్కరణల పర్వం కొనసాగుతోంది. తాజాగా, తుర్కియే, అజర్బైజాన్ దేశాలతో జరుపుతున్న అన్ని రకాల వాణిజ్యాన్ని, వాణిజ్య సంబంధాలను బహిష్కరించాలని ట్రేడర్స్ లాబీ ‘కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్’ (సీఏఐటీ) శుక్రవారం పిలుపునిచ్చింది. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతు పలుకుతూ ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) కూడా తుర్కియే, అజర్ బైజాన్ దేశాలతో అన్ని రకాల వర్తక, వాణిజ్యాన్ని రద్దు చేసుకోవాలని పరిశ్రమ వర్గాలను కోరింది. ఆ దేశాల వస్తువులను, ఇతర ఉత్పత్తులను ఆపేయాలని, ట్రేడర్స్ అంతా ఆ దేశాల నుండి దిగుమతులను నిలిపివేయాలని ‘సీఏఐటీ’ నిర్ణయించింది.
టర్కీలోని ఇనోను వర్సిటీతో ఐఐటీ-రూర్కీ తన ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత దేశ విద్యా వ్యూహం, జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపింది. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా టర్కీలోని విద్యా సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలను రద్దు చేసింది.