న్యూఢిల్లీ: పాలు కొనడానికి బయటకు వెళ్లిన యువకుడు (Indian Student) అదృశ్యమయ్యాడు. 19 రోజుల తర్వాత అతని మృతదేహం ఓ నదిలో దొరికింది. రాజస్థాన్‌లోని లక్ష్మణ్‌గఢ్ పరిధిలోని కఫన్‌వాడ గ్రామానికి చెందిన అజిత్ సింగ్ చౌధరి (Ajit Singh Chaudhary)అనే యువకుడు.. రష్యాలోని (Russia) బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్నాడు. యూఫా నగరంలో ఉంటున్న అతడు అక్టోబర్ 19న ఉదయం 11 గంటల సమయంలో పాలు కొనుగోలు చేయడానికి వెళ్తున్నానని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. దీంతో అదృశ్యమైన అతని గురించి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం అతని మృతదేహం వైట్ రివర్ డ్యామ్‌లో లభించింది. అయితే దీనిపై రష్యాలోని ఇండియన్ ఎంబసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ అతని మృతికి సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
19 రోజుల క్రితమే నది ఒడ్డున అతని దుస్తులు, మొబైల్ ఫోన్, బూట్లు లభించాయని విదేశాంగ శాఖ మాజీ మంత్రి జితేంద్ర సింగ్ అల్వార్ వెల్లడించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడితో ఏదో అసహ్యకరమైన ఘటన జరిగిందని ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు. ఎన్నో ఆశలతో అతని కుటుంబ సభ్యులు వైద్యవిద్యను అభ్యసించేందుకు 2023లో రష్యాకు పంపించారు. అయితే అతని మృతదేహం నదిలో లభించిందని ఈ రోజు వచ్చిన వార్త దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు.
रूस में दिवाली से लापता अलवर के लक्ष्मणगढ़ निवासी और MBBS के छात्र अजीत सिंह चौधरी का शव मिलने की ख़बर से मन व्यथित है।
कफ़नवाड़ा गाँव के अजीत को उनके परिवार ने बड़ी उम्मीदों और परिश्रम के साथ पैसे जुटाकर डॉक्टरी की पढ़ाई करने के लिए रूस भेजा था। करीब 19 दिन पहले वहाँ नदी किनारे…
— Jitendra Singh Alwar (@JitendraSAlwar) November 6, 2025