న్యూఢిల్లీ : రష్యా జలాల్లో ప్రయాణిస్తున్న ‘ఎం వీ ఓమోర్ఫి’ అనే వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ తెలిపింది. దాడి జరిగిన సమయంలో ఈ నౌకలో ముగ్గురు భారతీయ నావికులతో కలిపి మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన భారతీయుడి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఈ విషయమై రష్యాలోని భారత రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నదని, బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని విదేశాంగశాఖ పేర్కొంది.వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.