లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా బాధితులతో దేశంలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. బెడ్లు దొరకక ఎంతో మంది ఆస్పత్రుల ఆవరణల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇదిలావుంటే మరోవైపు ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఆక్సిజన్ అందక వివిధ ఆస్పత్రుల్లో 50 మందికిపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో అధికారులు ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్ అందించేందుకు చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను కరోనా రోగుల కోసం మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించకుండా ఆదేశాలు జారీచేశారు. దేశంలో వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేకు చెందిన ఓ రైలులో (ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్) జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు ఆక్సిజన్ ట్యాంకర్లను చేరవేశారు.
#WATCH | Indian Railway's 'Oxygen Express', carrying oxygen tankers, reaches Lucknow from Jharkhand's Bokaro. pic.twitter.com/Nf1UMoeYfD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 26, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
ప్రముఖ డైరెక్టర్ ఇంట విషాదం..!
ఎవరు ఈ చోలే జావో .. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్