న్యూఢిల్లీ: హాలీవుడ్లో ఇప్పుడు బార్బీ(Barbie) ఫిల్మ్ ఓ సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. మార్గట్ రాబీ, రియాన్ గోస్లింగ్ నటించిన ఆ ఫిల్మ్ బాక్సాఫీస్ వండర్స్ సృష్టిస్తోంది. అయితే ఆ ఫిల్మ్‌లో నటీనటులు పింక్ కలర్(Pink color) దుస్తుల్లో కేక పుట్టించారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ఆ పింక్ బార్బీ ఫీవరే కనిపిస్తోంది. ఆ ట్రెండ్‌ను ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ఆర్టిస్టు అద్భుతంగా వాడుకున్నాడు. తన ట్యాలెంట్‌తో ఇప్పుడతను ఇంటర్నెట్లో ఓ తుఫాన్ సృష్టిస్తున్నాడు. భారతీయ రాజకీయ నాయకులకు చెందిన ఇమేజ్‌లతో అతను బార్బీ పింక్ లుక్స్ తయారు చేశాడు. బార్బీ ఫ్యాషన్‌లో మన రాజకీయవేత్తలు(Politicians) వెలిగిపోతున్నారు.
వూ వోర్ వాట్ అన్న ఇన్‌స్టాగ్రామ్‌లో మన లీడర్ల ఫోటోలను పోస్టు చేశారు. మొత్తం పది మంది పొలిటీషియన్స్ ఆ బార్బీ లుక్‌లో అదరగొడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితిన్ గడ్కరీ నేతలకు చెందిన బార్బీ లుక్‌లను ఆ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బార్బీ లుక్‌లో రాజకీయనేతలు తెగ అట్రాక్టివ్‌గా దర్శనమిస్తున్నారు. పింక్ కలర్ దుస్తులతో స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. ఇక వాళ్ల మేకప్, హెయిర్డోస్ కూడా థ్రిల్ పుట్టిస్తోంది.