న్యూఢిల్లీ : ఆర్థిక ఆవిష్కరణలపై రూపొందిన ‘ఫోర్బ్స్ అండర్-30’ జాబితాలో భారత సంతతికి చెందిన అర్కిన్ గుప్తాకు స్థానం దక్కింది. ఆర్థిక ఆవిష్కరణలు, ప్రారంభ దశ పెట్టుబడి వ్యూహాలపై చేసిన కృషి ఆయనకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు తెచ్చిపెట్టింది. టెక్నాలజీ, డాటా ఆధారిత పెట్టుబడి విధానాలను గుప్తా అభివృద్ధి చేశారు. ఆర్థిక నిర్ణయాల్లో ‘టెక్నాలజీ’ ప్రాధాన్యం పెరిగిందని ఆయన భావిస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన జర్నలిస్టుల మరణాల్లో సగం ఇజ్రాయెల్ వల్లే సంభవించాయని ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ (ఆర్ఎస్ఎఫ్) తెలిపింది. అక్టోబర్ 2023 తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ చేతిలో మొత్తం 220 మంది జర్నలిస్టులు చనిపోగా, ఇందులో 65 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా హత్యకు గురయ్యారని నివేదిక పేర్కొన్నది. ‘ఆర్ఎస్ఎఫ్’ తాజా నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గత 12 నెలల కాలంలో హత్యకు గురైన జర్నలిస్టుల్లో 43శాతం మంది చావులకు ఇజ్రాయెల్ సైన్యమే కారణం. ఈ హత్యలన్నీ గాజాలో చోటుచేసుకున్నాయి.