న్యూఢిల్లీ, జనవరి 19: భారత నేవీ అమ్ములపొదిలో మరో జలాంతర్గామి చేరబోతున్నది. ఈ నెల 23న వాగీర్ జలాంతర్గామిని నేవీలోకి చేర్చనున్నారు. ప్రాజెక్ట్ -75లో భాగంగా ఈ కల్వరి తరగతికి చెందిన వాగీర్ జలాంతర్గామిని స్కార్పీన్ డిజైన్తో తయారుచేశారు.
హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెంచుకుంటున్న నేపథ్యంలో భారత నేవీ బలాన్ని పెంచుకునేందుకు ప్రాజెక్ట్ – 75కు భారత్ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్కార్పీన్ డిజైన్లతో ఆరు జలాంతర్గాములను తయారుచేయిస్తున్నది. ఇప్పటికే వీటిల్లో నాలుగు జలాంతర్గాములు నేవీలోకి ప్రవేశించాయి.