దుబాయ్: అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 278 డ్రాలో భారతీయుడు విజేతగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్ (30) మూడేళ్ల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్నారు. దుబాయ్ డ్రైడాక్స్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు.
మూడు నెలల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నారు. ఆగస్టు 19న కొన్న టికెట్‌కు సెప్టెంబరు 3న జరిగిన డ్రాలో సుమారు రూ.35 కోట్లు పలికింది. సందీప్ మాట్లాడుతూ, తనను అదృష్టం వరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సొమ్ముతో తన కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పారు. తన తండ్రి అనారోగ్యానికి చికిత్స చేయిస్తానని తెలిపారు. భారత్‌కు తిరిగి వచ్చి, సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తానన్నారు.