హైదరాబాద్ : భారతీయ న్యాయ వ్యవస్థ చాలా భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ బీఆర్ గవాయ్(CJI BR Gavai) తెలిపారు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు స్కాలర్షిప్ల ఆధారంగా వెళ్లాలని, కుటుంబంపై ఆర్థిక భారం మోపకుండా ఉండాలని ఆయన సూచన చేశారు. మన భారతీయ న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఆ సవాళ్లకు తగినట్లు పౌరులు రాణిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మన దేశం, న్యాయ వ్యవస్థ.. రెండూ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొన్ని కేసుల్లో విచారణ దశాబ్ధాల పాటు సాగుతుందని, కొన్నేళ్లు జైలు జీవితం అనుభవించిన తర్వాత వాళ్లు నిర్దోషులని కొన్ని కేసుల్లో తేలుతున్నాయని తెలిపారు. మన వద్ద ఉన్న ఉత్తమ టాలెంట్ ఆ సమస్యలను తీర్చుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పాస్ అవుట్ అవుతున్న గ్రాడ్యుయేట్లు సమగ్రతపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జీ పీఎస్ నర్సింహా, తెలంగాణ సీజే సుజోయ్ పౌల్ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.