న్యూఢిల్లీ : భారత ఉద్యోగ మార్కెట్ కీలకమైన మార్పులకు లోనవుతున్నది. ఫౌండ్ఇట్ సర్వే ప్రకారం వెంటనే ఉద్యోగంలో చేరే వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలింది. పెరుగుతున్న పోటీ వాతావరణంలో తక్కువ సమయంలో లక్ష్యాలను చేరుకొనేందుకు కంపెనీలు ఈ విషయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది. 2022 నుంచి ఈ పోకడ 58 శాతం పెరిగింది.
అయితే అలాంటి అభ్యర్థుల లభ్యత కేవలం 12 శాతం మాత్రమే పెరిగింది. దీంతో ప్రతిభావంతులను ఉద్యోగులుగా చేర్చుకొనే విషయం సంస్థలకు సవాల్‌గా మారింది. దీంతో వాటి వ్యాపార ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. ‘వెంటనే చేరేవాళ్లు’, ‘షార్ట్ నోటీస్ (30 రోజుల్లోపు), ‘అత్యవసర నియామకం’ లాంటి పదాల వాడకం జాబ్ మార్కెట్లో బాగా పెరిగింది.