Aditya L1 Project | పర్ఫ్యూమ్ వేసుకుంటే ప్రవేశం నిషిద్ధం.. వీఈఎల్సీ పేలోడ్ తయారీలో శాస్త్రవేత్తల జాగ్రత్తలు
ఆదిత్య-ఎల్1 ప్రాజెక్టులో ఎంతో కీలకమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్సీ) పేలోడ్ తయారు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
Aditya L1 Project | బెంగళూరు, సెప్టెంబర్ 3: ఆదిత్య-ఎల్1 ప్రాజెక్టులో ఎంతో కీలకమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్సీ) పేలోడ్ తయారు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కోసం బెంగళూరులోని ఐఐఏకు చెందిన సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ (క్రెస్ట్) క్యాంపస్‌లో ఉన్న ఎంజీకే మీనన్ ల్యాబోరేటరీలో ప్రత్యేకంగా ‘క్లాస్ 10’ క్లీన్ రూమ్‌ను రూపొందించారు. మరోవైపు అందులో ప్రవేశానికి ఎన్నో ఆంక్షలు విధించారు. ఎంతగా అంటే కనీసం.. పర్ఫ్యూమ్ వేసుకొని అందులోకి ప్రవేశించకుండా నిషేధించారు.
ఎందుకు నిషేధించారంటే…
దవాఖానల్లోని ఐసీయూలతో పోలిస్తే ఈ క్లీన్ రూమ్ లక్ష రెట్లు శుభ్రంగా ఉంటుంది. క్లీన్ రూమ్‌లో ఓ చిన్న కాలుష్య కణం ఉన్నా వీఈఎల్సీ తయారీ పనులు ఆగిపోయే ఆస్కారం ఉంటుంది. అప్పటి వరకు శాస్త్రవేత్తలు పడ్డ శ్రమ మొత్తం వృథా అవుతుంది. దీంతో పర్ఫ్యూమ్ వాడకాన్ని కూడా నిషేధించారు. కాగా, అందులోకి ప్రవేశించే శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేకమైన సూట్లు ధరించి లోపలికి వెళ్లారు. మరోవైపు వారు అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయ్యాకే అందులోకి ప్రవేశించారు.
ఆదిత్య-ఎల్1 కక్ష్య పెంపు విజయవంతం
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ వడివడిగా లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది. ఆదివారం ఇస్రో చేపట్టిన ఆదిత్య-ఎల్1 శాటిలైట్ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతమైంది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. ఈ నెల 5న రెండోసారి కక్ష్యను పెంచనున్నట్లు ఇస్రో తెలిపింది. ‘ప్రస్తుతం శాటిలైట్ హెల్తీగా ఉంది. ఆదివారం చేపట్టిన కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం శాటిలైట్ 245 x 22,459 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతున్నది. తదుపరి కక్ష్య పెంపు ప్రక్రియ సెప్టెంబర్ 5న ఉండనున్నది’ అని ఇస్రో ఎక్స్ వేదికగా తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

