న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: నాసా ఇటీవల చేపట్టిన ఇన్జెన్యువిటీ హెలికాప్టర్ (అంగారక గ్రహంపై ఎగిరిన హెలికాప్టర్) ప్రయోగంలో భారత సంతతికి చెందిన ఇంజనీర్ బాబ్ బలరామ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇన్జెన్యువిటీ స్కౌట్ ప్రాజెక్టుకు ఆయన చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరించారు. 20 ఏండ్లుగా నాసాలో సేవలందిస్తున్నారు. ఇన్జెన్యువిటీ ప్రయోగానికి కావాల్సిన ముఖ్యమైన పరికరాన్ని ఈ ల్యాబ్ అందించింది. బలరామ్ మద్రాస్ ఐఐటీలో 1975-80 బ్యాచ్‌కు చెందినవారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ డిగ్రీ అందుకొన్నారు. తర్వాత అమెరికాలో కంప్యూటర్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్, పీహెచ్డీ చేశారు. అనంతరం నాసాలో చేరారు.