Vispy Kharadi | న్యూఢిల్లీ, మార్చి 14: రెండు హెర్కులెస్ స్తంభాలను ఎక్కువ సేపు నిలబెట్టి భారతీయ అథ్లెట్ విస్పీ ఖరాడీ ప్రపంచ రికార్డును సాధించాడు. 2 నిమిషాల 10.75 సెకండ్ల పాటు రెండు స్తంభాలను పట్టుకుని గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ వీడియోను గిన్నిస్ బుక్ పోస్టు చేయగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన సలహాదారు ఎలాన్ మస్క్ సైతం దాన్ని షేర్ చేశారు. గ్రీకు వాస్తు శిల్పాన్ని పోలిన రెండు స్తంభాలను కింద పడకుండా ఖరాడీ పట్టుకోవడం ఈ వీడియోలో కనిపించింది.
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఖరాడీ ఖాతాలో ఇది 15వ గిన్నిస్ రికార్డు. బ్లాక్ బెల్ట్ విజేత అయిన ఖరాడీ ఐఐఎం-బీ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. అమెరికాలోని అంతర్జాతీయ స్పోర్ట్ సైన్స్ అకాడమీ గుర్తింపు పొందిన స్పోర్ట్స్ న్యూట్రీషనిస్టు కూడా. ఆయన స్టం ట్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, మోడల్‌గానూ పని చేస్తున్నారు.