న్యూఢిల్లీ: స్వదేశీ కృత్రిమ మేధస్సు సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మెన్ ఆకాశ్ అంబానీ(Akash Ambani) పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు. స్వదేశీ ఏఐ సామర్థ్యం, అప్లికేషన్స్ పెంచేందుకు.. స్వదేశీ డేటా సెంటర్లను కూడా అభివృద్ధి చేయాలన్నారు. ఇక భారత్కు చెందిన డేటాను భారత్లోనే ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీని కోసం డేటా సెంటర్ పాలసీని ప్రభుత్వం తీసుకురావాలని ఆయన కోరారు. మానవ మెదడు సృష్టించిన విప్లవాత్మకమైన సాధనం ఏఐ అని, మన జీవితాన్ని, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను ఆ టూల్ మార్చేస్తుందన్నారు. 2047 నాటి వరకు వికసిత్ భారత్ సృష్టించాలన్న కలను సాకరం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు.