లడఖ్‌లో కీలక పాయింట్ నుంచి… భారత్, చైనా దళాలు వెనక్కి
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో మరో విడత సైనిక దళాల వెనక్కి మళ్లింపు ప్రక్రియ మొదలైంది. లడఖ్‌లోని కీలకమైన స్టాండ్ ఆఫ్ పాయింట్ నుంచి ఇరు దేశాల ఆర్మీ దళాలు వైదొలగడం ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య ఇటీవల జరిగిన 16వ విడత సైనిక చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల దళాలు వెనక్కి తగ్గుతున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న చైనా దళాలు 2020కి ముందు ఉన్న స్థానాలకు తిరిగి వెళ్లనున్నాయి.
కాగా, సరిహద్దులో చొరబాట్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్-మే నెలలో భారత్, చైనా మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం అదే ఏడాది జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద ఇరు దేశాల సైనికులు బాహాబాహీగా తలపడ్డారు. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు అమరులయ్యారు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగడంతో పోటాపోటీగా సైనిక దళాలను ఇరు దేశాలు మోహరించాయి.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడంపై భారత్, చైనా దృష్టిసారించాయి. ఇప్పటి వరకు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య 16 రౌండ్ల చర్చలు జరిగాయి. తాజాగా జూలై 17న జరిగిన 16వ విడత చర్చల్లో పురోగతి కనిపించింది. ఇండియా, చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశంలో ఇరు దేశాల సైనిక దళాల ఉపసంహరణపై చర్చించారు.
ఈ నేపథ్యంలో గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ (PP-15) ప్రాంతం నుంచి భారత, చైనా దళాలు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా సెప్టెంబర్ 8న వెనక్కి మళ్లడం ప్రారంభించినట్లు ఇరు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

