న్యూఢిల్లీ, జూన్ 24: పలుమార్లు వాయిదా తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి యాత్ర ఎట్టకేలకు ఖరారైంది. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్న ‘యాక్సియం-4’ మిషన్‌ను బుధవారం చేపడుతున్నట్టు నాసా తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధించి స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌ను ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించబోతున్నారు.
‘బుధవారం (భారత్‌లో రాత్రి 12.01 గంటలకు) మిషన్‌ను చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు డాకింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ మిషన్‌కు పెగ్గీ విట్సన్ కమాండర్‌గా, శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. హంగేరీకి చెందిన టిబోర్ కపు, పోలండ్‌కు చెందిన స్లావోజ్ ఉనాన్సిక్-విన్సివిస్క్లు మిషన్ స్పెషలిస్టులుగా ఉన్నారు.మే 29న చేపట్టాల్సిన ఈ మిషన్ ఆరుసార్లు వాయిదా పడింది.