Rajouri Encounter: ఇటీవలే రాజౌరీలో ముష్కరులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్‌లో వారి జాడను గుర్తించిన శునకాన్ని ఇండియన్ ఆర్మీ ఘనంగా సత్కరించింది. ‘డొమినొ’ అనే పేరుగల ఆర్మీ డాగ్‌తో పాటు దాని నిర్వాహకుడు లాన్స్ నాయక్ లక్కీ కుమార్లకూ శుక్రవారం లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నార్తర్న్ కమాండ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది.
రాజౌరీలో ఐదుగురు భారత సైనికుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఇద్దరు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాడుల ఆట కట్టించడానికి ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో డొమినో కాలికి గాయమైనా ఉగ్రవాదుల వేటను మాత్రం ఆపలేదు. చివరికి కలకోటె ఏరియాలో ముష్కరుల రక్తపు మరకల ద్వారా వారి జాడను గుర్తించడంతో సైనికులు ఉగ్రవాదుల ఆట కట్టించారు.
#OPSOLKI#LtGenUpendraDwivedi #ArmyCdr, Northern Command visited #Kalakote area in #Rajouri and reviewed the operational situation. He was briefed on the recently conducted operation in which two hardcore terrorists were neutralised.
The Army Commander complimented &… pic.twitter.com/rC71L9XZhx
— NORTHERN COMMAND – INDIAN ARMY (@NorthernComd_IA) November 24, 2023