హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ శుక్రవారం పలు కీలక బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపాలిటీల(నాలుగో) సవరణ బిల్లు, జీహెచ్ఎంసీకి చెందిన రెండు సవరణ బిల్లులు, తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు, తెలంగాణ మోటర్ వెహికిల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లులు ఉన్నాయి.
ఇందులో భాగంగా తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మామిడిపల్లిలో రాజీవ్‌గాంధీ ఎయిర్పో ర్టు వద్ద ఢిల్లీకి చెందిన అమిటీ యూనివర్సిటీ, భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ముఖిలో సెయింట్‌మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు.