కదిలే మోటార్ బైక్‌లపై ఎత్తయిన ‘హ్యూమన్ పిరమిడ్’తో భారత ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ సరికొత్త రికార్డు సృష్టించింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో డేర్ డెవిల్స్ ఈ అసాధారణ ప్రదర్శనను సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో హ్యూమన్ పిరమిడ్‌ను సాధించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్ వాహనాలపై నిలబడి 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు.
తాజా ఫీట్‌తో డేర్ డేవిల్స్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తోపాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్.. ఇలా 33 ప్రపంచ రికార్డులను సాధించింది. డేర్‌డెవిల్స్ మొత్తం 1,600సార్లు మోటార్ సైకిళ్లపై ప్రదర్శనలు నిర్వహించింది.