న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళం కొత్తగా 114 రఫేల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets) కొనుగోలు కోసం ప్రతిపాదన చేసింది. రక్షణశాఖకు ఆ ప్రతిపాదన పంపించింది. తమ దళాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఐఏఎఫ్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మల్లీరోల్ ఆపరేషన్స్‌లో పాల్గొనే యుద్ధ విమానాలు అవసరమని ఐఏఎఫ్ పేర్కొన్నది. అయితే ఆ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని రక్షణశాఖను కోరింది.
భారత్‌లో యుద్ధ విమానాలను మేకిన్ ఇండియా స్కీమ్ కింద నిర్మించనున్నారు. దీనికి డసాల్ట్ ఏవియేషన్ సంస్థ సహకరించనున్నది. యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ నుంచి క్లియరెన్స్ దక్కాల్సి ఉంటుంది. వైమానిక దళం వద్ద ప్రస్తుతం 36 రఫేల్స్ ఉన్నాయి. మరో 26 మెరైన్ వేరియంట్ల కోసం నేవీ ఆర్డర్ చేసింది.
తక్షణమే మరో రెండు స్క్వాడ్రన్ల విమానాలను దళంలోకి తీసుకునే సామర్థ్యం ఐఏఎఫ్‌కు ఉన్నది. అంటే సుమారు మరో 38 యుద్ధ విమానాలను దళంలోకి తీసుకునేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉన్నది.