న్యూఢిల్లీ : బుద్ధుని అవశేషాలు 127 ఏండ్ల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, దేశ సాంస్కృతిక వారసత్వానికి ఇది సంతోషకరమైన రోజు అని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని పిపర్‌హవా ప్రాంతంలో 1898లో జరిగిన తవ్వకాల్లో ఈ అవశేషాలు బయటపడ్డాయని చెప్పారు.
వలసపాలన కాలంలో వీటిని తరలించుకుపోయారన్నారు. కొన్ని నెలల క్రితమే ఇవి అంతర్జాతీయ వేలంలో కనిపించాయని, వాటిని స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మన దేశానికి బుద్ధునితో, ఆయన బోధనలతో ఎంతో అనుబంధం ఉందని ప్రధాని తెలిపారు.