న్యూఢిల్లీ : అమెరికా, భారత్ మధ్య పదేళ్ల డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ కుదిరిందని అమెరికా సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ శుక్రవారం చెప్పారు. ఇది ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభమని తెలిపారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య సమన్వయం, సమాచారం ఇచ్చి, పుచ్చుకోవడం, సాంకేతిక సహకారం పెరుగుతాయని చెప్పారు.
రక్షణ రంగంలో భాగస్వామ్యం మరింత పెరుగుతుందన్నారు. మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియాన్ డిఫెన్స్ మినిస్టీరియల్ సమ్మిట్ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీట్ హెగ్సెత్ సమావేశమయ్యారు. డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు జరగడంతో నూతన అధ్యాయం ప్రారంభమైందని రాజ్‌నాథ్ అన్నారు.