New millionaires | కొత్త కుబేరుల పెరుగుదలలో చైనాను మించిన భారత్.. 2025లో రెట్టింపు కంటే ఎక్కువ నమోదు
కొత్త కుబేరుల పెరుగుదలలో చైనాను భారతదేశం మించిపోయింది. యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్టు 2026 ప్రకారం 2025లో భారతదేశంలో యూఎస్ డాలర్ మిలియనీర్లు 31,033 మంది పెరిగారు.
- 2025లో రెట్టింపు కంటే ఎక్కువ నమోదు
న్యూఢిల్లీ, జూలై 11: కొత్త కుబేరుల పెరుగుదలలో చైనాను భారతదేశం మించిపోయింది. యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్టు 2026 ప్రకారం 2025లో భారతదేశంలో యూఎస్ డాలర్ మిలియనీర్లు 31,033 మంది పెరిగారు. 14,079 బిలియనీర్ల చైనాతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. కాగా, భారతీయులు ధనవంతులు అవుతున్నప్పటికీ వారు ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో వలే తమ సంపదను నిల్వ చేయడం లేదు. సంపదకు యూబీఎస్ ఇచ్చే నిర్వచనం ఆర్థిక ఆస్తులు, ప్లస్ వాస్తవ ఆస్తులు ప్రధానంగా గృహాలు, అందులోంచి అప్పులు తీసివేస్తారు. ఆ విధంగా కొలిచినప్పుడు భారత దేశ స్థూల వ్యక్తిగత సంపదలో కేవలం 25.8 శాతం మాత్రమే ఆర్థిక ఆస్తుల రూపంలో ఉన్నది. అదే సమయంలో అమెరికాలో 78.9 శాతం, జపాన్‌లో 68.9 శాతం, దక్షిణ కొరియాలో 51.9 శాతం ఉన్నది. ఆ విషయంలో భారతదేశం పట్టికలో అడుగున ఉంది. చైనాలో 53 లక్షల మందికి పైగా డాలర్ మిలియనీర్లు ఉన్నారని యూబీఎస్ అంచనా. భారత దేశంలో 9.44 లక్షల మంది ఉండగా..అమెరికా 2.36 కోట్ల మందికి పైగా మిలియనీర్లతో అగ్ర స్థాయిలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- India
- money
- new millionaires
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

