న్యూఢిల్లీ, ఆగస్టు 29: అణ్వస్త్ర సామర్థ్యమున్న ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో జలాంతర్గామిని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ అరిఘాత్ రెండో అణు జలాంతర్గామి అని, దీని ప్రవేశంతో దేశ అణు సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు.
తొలి అణు జలాంతర్గామి అరిహంత్‌ను 2016లో ప్రారంభించారు. దానికి అడ్వాన్స్డ్ వెర్షన్‌గా మరిన్ని ఆధునిక హంగులతో అరిఘాత్‌ను నిర్మించారు. ఐఎన్ఎస్ అరిఘాత్ సముద్ర ఉపరితలంపై గంటకు 12-15 నాటికల్ మైళ్ల వేగంతో, సముద్ర అంతర్భాగంలో గంటకు 24 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.