న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్లలో ఇవాళ అలర్ట్ మెసేజ్(Extremely Severe Alert) మారమోగింది. కొత్త తరహా విపత్తు హెచ్చరిక మెసేజ్‌ను ఇండియా పరీక్షించింది. ఈ డ్రిల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లకు నోటిఫికేషన్ వచ్చింది. భారీగా శబ్ధం చేస్తూ ఫోన్లు మోగాయి. వైబ్రేషన్ కూడా ఇచ్చారు. ఏదైనా విపత్తు సంభవిస్తే, అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశాన్ని తెలియజేసేందుకు మెసేజ్ డ్రిల్ ఏర్పాటు చేశారు. సెల్ బ్రాడ్కాస్ట్ వార్నింగ్ సిస్టమ్‌ను కేంద్రం కొత్తగా డిజైన్ చేసింది. ఆ సిస్టమ్ ప్రకారం ఇవాళ ఉదయం 11.46 నిమిషాలకు ఎమర్జెన్సీ సీవియర్ అలర్ట్ మెసేజ్ మొబైల్ ఫోన్లపై ప్రత్యక్ష మైంది. ఆ సమయంలో గట్టిగా ట్యూన్ వచ్చింది. ఫ్లాష్ మెసేజ్ తరహాలో ఫోన్ మోగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కమ్యూనికేషన్ మంత్రి సింథియా ఈ సిస్టమ్‌ను ప్రారంభించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ దీన్ని డెవలప్ చేసింది. సాచెట్ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్త అలర్ట్ సిస్టమ్‌ను డెవలప్ చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్తో అలర్ట్‌ను మోగించారు.
అలర్ట్ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోవద్దు అని, ఇది కేవలం అప్రమత్తతను పరీక్షించేందుకు మెసేజ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సెల్ బ్రాడ్కాస్ మెసేజ్ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మెసేజింగ్ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ఫోన్ సైలెంట్లో ఉన్నా లేదా డునాట్ డిస్టర్బ్ మోడ్‌లో ఉన్నా.. కొత్త తరహా అలర్ట్ మెసేజ్ మాత్రం మొబైల్ ఫోన్‌పై ప్రత్యక్షం అవుతుంది. అలారం శబ్ధం బలంగా వినిపిస్తుంది. తక్షణమే ఫోన్ వాడే వ్యక్తి ఆ మెసేజ్‌ను చదివే రీతిలో డిస్ప్లే చేశారు. భూకంపాలు, సునామీలు, పిడుగుపాటు లాంటి సహజ విపత్తులు సంభవించినప్పుడు, గ్యాస్ లీకేజీలు, రసాయనిక చర్యల సమయంలోనూ కొత్త తరహా అలర్ట్ సిస్టమ్‌ను వాడుకోవచ్చు