Suryastra | సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం.. భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం
Suryastra : దేశీయంగా తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇది లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. నిబె లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
Suryastra : దేశీయంగా తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇది లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. నిబె లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది నిర్దిష్ట లక్ష్యాల్ని కచ్చితత్వంతో పూర్తి చేసింది. ఇందులో రెండు వెర్షన్లు ఉంటాయి. ఒకటి 150 కిలోమీటర్ల రేంజ్, రెండోది 300 కిలోమీటర్ల రేంజ్. ఈ రెండింటినీ పరీక్షించగా విజయవంతమయ్యాయి.
150 కిలోమీటర్ల రేంజ్ ‘సూర్యాస్త్ర’ రాకెట్ లక్ష్యానికి 1.5 మీటర్ల దూరంలో, 300 కిలోమీటర్ల రేంజ్ ‘సూర్యాస్త్ర’ రాకెట్ లక్ష్యానికి 2 మీటర్ల దూరంలో తాకింది. మిలిటరీ భాషలో దీన్ని ‘సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ (సీఈపీ)’ అని పిలుస్తారు. ఇది ఎంత తక్కువగా ఉంటే పరీక్ష అంత విజయవంతమైనట్లు. దూరంగా ప్రయోగించే క్షిపణులు, రాకెట్లకు ఇది చాలా మంచి లక్ష్యమే. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈ రాకెట్ వ్యవస్థల్ని భారత ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. దేశీయంగా తయారు చేసిన, గైడెడ్ రాకెట్ వ్యవస్థ ‘సూర్యాస్త్ర’. నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకునేందుకు, శత్రువుల కమాండ్ సెంటర్స్, రాడార్ సైట్లు, మిలిటరీ స్థావరాలు, రవాణా సదుపాయాలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటుంది.
ఇవి ఇంతకుముందు ఉన్న సంప్రదాయ ఫిరంగి గుండ్లలాగా కాకుండా ఆధునిక సాంకేతికతను ఎంచుకుని, సుదూర లక్ష్యాల్ని కచ్చితత్వంతో చేరుకుంటాయి.150 కిలోమీటర్ల లక్ష్యం గల రాకెట్ను ఆర్మీ నేరుగా యుద్ధంలో వాడొచ్చు. ఇక, 300 కిలోమీటర్ల రేంజ్ రాకెట్ మరింత శక్తివంతమైంది. ఇది శతృవుల భూభాగంలో ఉన్న లోతట్టు స్థావరాల్లోని లక్ష్యాల్ని కూడా చేరుకోగలదు. ఈ తరహా రాకెట్ వ్యవస్థలో యుద్ధ సమయంలో చాలా కీలకం అని నిపుణులు చెబుతున్నారు. ఈ రాకెట్ వ్యవస్థను ప్రైవేట్ సంస్థ తయారు చేసింది.
ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఇలాంటి రాకెట్లు, డ్రోన్లు వంటివి తయారు చేస్తున్నాయి. దీని ద్వారా ఇండియా వీటిని విదేశాల నుంచి కొనుగోలు చేసే అవకాశం తగ్గుతుంది. ఇది భారత రక్షణ వ్యవస్థకే కాకుండా.. ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

