న్యూఢిల్లీ, ఆగస్టు 22: టెలికాం కంపెనీలకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వినియోగదారులకు ఏపీకే ఫైల్స్, యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్‌లు, బ్లాక్ లిస్టులో ఉన్న కాల్‌బ్యాక్ నెంబర్లతో కూడిన మెసేజ్‌లను పంపరాదని ఆదేశించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని తెలిపింది. కొంతమంది మోసగాళ్ల బారి నుంచి వినియోగదారుల రక్షణ, స్వచ్ఛమైన మెసేజింగ్ విధానం కోసం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ట్రాయ్ తెలిపింది.
అలాగే టెలీమార్కెటింగ్ కాల్స్‌కు సంబంధించి ట్రాయ్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అన్ని టెలీ మార్కెటింగ్ కాల్స్‌కు సంబంధించిన నెంబర్లు విధిగా ’30 140’తో ప్రారంభం కావాలి. కాగా, రిజిస్టర్ కాకుండా స్పామ్ కాల్స్ చేస్తున్న టెలీమార్కెటీర్ల నెంబర్లను రెండేండ్ల పాటు బ్లాక్‌లిస్టులో పెట్టాలని గత వారం ట్రాయ్ టెలికం కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది.