న్యూఢిల్లీ: భారత్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ వ్యాధితో (Diabetes) బాధ పడుతున్నారని గురువారం విడుదలైన ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ భారత ఆరోగ్య సూచిక 2025 నివేదిక వెల్లడించింది. పరిశోధన సంస్థ కాంటార్తో కలిసి ఆ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం జనరేషన్ జెడ్ ఆరోగ్యం అన్ని అంశాల్లో పడిపోయింది.
జనరేషన్ ఎక్స్, మహిళల్లో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 19 పట్టణ కేంద్రాల్లో 2 వేల మంది ప్రజల నుంచి వివరాలను సేకరించారు. ఎక్కువగా కూర్చొని పని చేయడం, పంచదార, ఉప్పు ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం, పని ఒత్తిడి వల్ల యువతరం డయాబెటిస్ బారిన పడుతున్నట్టు సర్వేలో గుర్తించారు.